![]() |
![]() |

చార్లీ చాప్లిన్ ఎంతోమందిని ఎంటర్టైన్ చేసాడు...కానీ అతని జీవితమే కష్టాల కడలి. జబర్దస్త్ లో ఉన్న ఇమ్మానుయేల్ లైఫ్ కూడా ఇంచుమించు ఇంతే. అతని జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ వేదిక మీద నిలబడ్డాడో అతని స్టోరీ ద్వారా అర్ధమవుతోంది.
"మాది అమరావతి దగ్గర వైకుంఠపురం గ్రామం. నా జీవితంలో అనుకోనిది ఏదైనా జరిగింది అంటే అది నేను ఆర్టిస్ట్ ని అవ్వడమే. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. చదువుకు తగ్గ జాబ్ దొరకలేదు. దాంతో కొన్ని నెలలు తాపీ బొచ్చెలు మోయడానికి వెళ్లాను. వేళ్ళ చివర్లు బొబ్బలెక్కిపోయాయి. దాంతో నేను అమ్మ దగ్గర ఏడ్చేవాడిని. నేను దేవుడిని నమ్మను. తినడానికి తిండి లేని ఫామిలీలో ఎలా పుట్టించావు. తిండి లేకపోతే మనుషులు ఎలా బతుకుతారు అని బాధపడేవాడిని. వర్షం వస్తే మా ఇంట్లో నన్ను మా అన్నను పడుకోబెట్టి అమ్మా నాన్న మా మీద నీళ్లు పడకుండా గోనె పట్టాలు పట్టుకునేవారు. చుట్టాలు కూడా ఎవరూ హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అప్పుడే దేవుడిని ఒక్కటే అడిగా నాకు డబ్బు వద్దు నేను స్టేజి మీద కామెడీ చేయాలి.. దానికి ఒక్క దారి చూపించు అని అడిగా.
అప్పుడు యూట్యూబ్ లో ఒక షోకి ఆడిషన్స్ ఉన్నాయి అని చూసి వెళ్ళా.. 2 వేల మందిలో 20 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఉన్నాను. దాంతో ఆ షోలో కొన్ని ఎపిసోడ్స్ చేసాక ఊరెళితే ఏరా ఇదంతా ఎందుకు నీకు మీ నాన్న చదివించాడు జాబ్స్ చేసుకోక అని అన్నారు. నువ్వేమన్నా హీరోవా నిన్ను అందరూ గుర్తుపట్టేస్తారని అనుకుంటున్నావా అనేసరికి మా నాన్నకు ఈ మాటలు చెప్పా.. ఎవరి మాటలు వినకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో అన్నాడు. మా ఊరిలో మా నాన్నతో మాట్లాడే విధానం నాకు నచ్చేది కాదు. అందుకే మా నాన్నకు నేను రెస్పెక్ట్ తీసుకురావాలి అనుకున్నా. నేను చర్చికి వెళ్తే అక్కడి నుంచి బయటకు రావడానికి మూడున్నర గంటలు పట్టింది. ఎవరైతే మమ్మల్ని అన్నారో వాళ్ళే సెల్ఫీ ఇవ్వరా అని అడిగారు. మా నాన్న డిగ్రీలో చిన్న ఇల్లు కట్టించాడు. దాన్ని నేను అలాగే ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు త్రి ఫ్లోర్స్ తో పెద్ద ఇల్లు కట్టించాను. అందులో అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. అద్దెకిద్దాం, ఇన్ని ఫ్లోర్స్ ఊడ్చలేకపోతున్నా అని అమ్మ అంటున్న కూడా నేను వాళ్లనే ఉండమని చెప్పాను" అంటూ తన లైఫ్ లో జరిగిన కష్టాలను కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో చెప్పాడు ఇమ్మానుయేల్.
ఇక ఇమ్ము స్టోరీని వింటూ కన్నీళ్లు పెట్టుకున్న డెబ్జాన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్ని కష్టాలు ఉన్నాయా ఇమ్ముని ఎప్పుడూ ఇలా చూడలేదు కదా అందుకే అంటూ వెళ్లి ఇమ్ముని హగ్ చేసుకుంది.
![]() |
![]() |